చర్ల మండలం పెద్దపల్లి–ముమ్మిడివరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ అంకిత్ సందర్శించారు. ఇప్పటివరకు వచ్చిన ధాన్యం పరిమాణం, కొనుగోలు ప్రక్రియ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని, సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.