చర్ల: జిల్లా రైతులకు సాగునీరు అందించాలి

70చూసినవారు
చర్ల: జిల్లా రైతులకు సాగునీరు అందించాలి
భద్రాద్రి జిల్లాలోని సీతమ్మసాగర్ సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లా రైతాంగానికి సాగునీరు అందించాలని, సాగునీరు ఖమ్మం ఇతర ప్రాంతాలకు తరలించవద్దని బీఆర్ఎస్ చర్ల మండల అధ్యక్షుడు దొడ్డి తాతారావు అన్నారు. ఖమ్మం రైతులకు సాగునీరు ఇవ్వడం మంచిదే కానీ, భద్రాద్రి జిల్లాను విస్మరించడం సరికాదన్నారు. జిల్లా రైతులకు సాగునీరు అందించాలని సోమవారం చర్ల తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్