చర్ల మండలంలో ఆదివారం రెండు ఇసుక లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృత్యుశకటాల్లా మారుతున్న ఇసుక లారీల వేగాన్ని నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.