కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా భద్రాచలం రామాలయ పరిధిలోని శివాలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించి, ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. శివుడిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న భక్తులతో ఆలయ ప్రాంగణం 'హర హర మహాదేవ్' నినాదాలతో మారుమోగింది.