దుమ్ముగూడెం మండలంలో అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. డివిజన్ నాయకులు సున్నం వీరభద్రం మాట్లాడుతూ, ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు తుఫాను వల్ల తడిసిపోయాయని, ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో పంట నష్టపరిహారంపై అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు.