దుమ్ముగూడెం మండలం జడ్పీ హైస్కూల్ను ఐటీడీఏ పీఓ రాహుల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుడు కారం గాంధీ ఉద్దీపకం వర్క్ బుక్-2 అంశాలపై ప్రత్యేక శ్రద్ధతో బోధించడాన్ని ఆయన గమనించారు. విద్యార్థులు ప్రతి అంశంలో చదువు పరంగా నైపుణ్యాలు పెంచుకోవడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నందుకు పీఓ ఆ ఉపాధ్యాయుడిని అభినందించారు. ఈ తనిఖీలో ఉపాధ్యాయుడి బోధనా పద్ధతులు, విద్యార్థుల పురోగతిని పీఓ సమీక్షించారు.