నేడు భద్రాచలంకు రానున్న గవర్నర్‌

3చూసినవారు
నేడు భద్రాచలంకు రానున్న గవర్నర్‌
భద్రాచలంలో శనివారం జరిగే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా హాజరుకానున్నారు. ఆయన ఉదయం 10:40 గంటలకు భద్రాచలం చేరుకుని, అనంతరం సారపాకలోని ఐటీసీ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటారు. 11 గంటలకు రామయ్యను దర్శించుకుని, 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మిథిలా స్టేడియంలో జరిగే పట్టాభిషేక వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం భద్రగిరి మార్ట్‌ను ప్రారంభించి తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.

సంబంధిత పోస్ట్