దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల ఘాట్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి అనుమతులు లేవని తహసీల్దార్ మామిడి అశోక్‌కుమార్ శనివారం తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు విగ్రహాల నిమజ్జనం కోసం భద్రాచలం వద్ద ఉన్న గోదావరి ఘాట్‌లకు మాత్రమే వెళ్లాలని సూచించారు. శాంతిభద్రతల దృష్ట్యా అధికారులు జారీ చేసిన ఆదేశాలను ప్రజలు, నిర్వాహకులు పాటించి పోలీసు, రెవెన్యూ శాఖలకు సహకరించాలని ఆయన కోరారు.