దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి, తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. వారు ముఖ్యమైన ఫైళ్లు, నగదు పుస్తకం, తీర్మానాల రిజిస్టర్‌ను అపహరించారు. ఉదయం కార్యదర్శి అనంత్ కుమార్ ఈ విషయాన్ని గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి, ఎంపీడీవో రవీందర్ రెడ్డి కేసు నమోదు చేసుకున్నారు.