చర్ల ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ముస్లింల అభివృద్ధి కోసం మసీదు నిర్మాణానికి గతంలో కేటాయించిన భూమి ఆక్రమణలకు గురవుతోందని బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు చరణ్ తెలిపారు. సోమవారం బీఎస్పీ చర్ల మండల నాయకులు ఈ భూమిని సందర్శించి, వెనుకబడిన ముస్లిం సామాజిక వర్గం అభివృద్ధి కొరకు కేటాయించిన ఈ భూమి ఆక్రమణలకు గురవుతుంటే సహించబోమని హెచ్చరించారు.