చర్ల CHCలో అద్భుతం..ఒకే రోజు 8 ప్రసవాలు విజయవంతం

8చూసినవారు
చర్ల CHCలో అద్భుతం..ఒకే రోజు 8 ప్రసవాలు విజయవంతం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) వైద్యులు, సిబ్బంది సమష్టి కృషితో ఒకే రోజులో ఏకంగా 8 డెలివరీలు విజయవంతంగా శనివారం పూర్తి చేశారు. చర్ల మండలంతో పాటు ఏజెన్సీ పరిసర గ్రామాల నుంచి వచ్చిన గర్భిణులకు వైద్యులు సురక్షితంగా ప్రసవాలు నిర్వహించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి సేవలందిస్తూ భరోసా కల్పిస్తున్న స్థానిక వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని స్థానికులు, బాలింతల కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్