భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజరలో అనారోగ్యంతో మృతి చెందిన సారెడ్డి నారపరెడ్డి కుటుంబ సభ్యులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం పరామర్శించారు. మోరంపల్లి బంజర లోని నారపరెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నారపరెడ్డి మృతి కుటుంబానికి తీరని లోటని, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.