ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామానికి చెందిన ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురై భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం పరామర్శించారు. వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ పూనెం కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.