ఫోన్ టాంపరింగ్ పై కేసీఆర్ కు నోటీసులు: బీఆర్ఎస్ నిరసన

277చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఫోన్ టాంపరింగ్ విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటాన్ని నిరసిస్తూ ఈ ధర్నా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని పథకం ప్రకారం ఫోన్ టాంపరింగ్ చేసి, కేసులు వేసి, మున్సిపల్ ఎన్నికల సమయంలో కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ నాయకులను కోర్టుల చుట్టూ తిప్పుతూ రాక్షసానందం పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుందుడుకు చర్యలను మెచ్చా తప్పు పట్టారు.

సంబంధిత పోస్ట్