భద్రాచలంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు

6చూసినవారు
భద్రాచలంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు
భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు సతీష్, శ్యాంప్రసాద్ పోలీస్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఈ తనిఖీల్లో వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, నిబంధనల అమలు వంటి అంశాలను పరిశీలించారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్