చర్ల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని చర్ల, దండుపేట, సుబ్బంపేట ఫీడర్లలో శుక్రవారం మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ గురువారం తెలిపారు. వినియోగదారులు దీనిని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు.