రోడ్లపై చెత్త వేస్తే రూ.10 వేల జరిమానా

0చూసినవారు
రోడ్లపై చెత్త వేస్తే రూ.10 వేల జరిమానా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం పరిధిలో రహదారుల వెంట చెత్త వేసే వ్యాపారులపై పంచాయతీ కార్యదర్శి రాంబాబు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాతచర్ల–వెంకటాపురం రోడ్డుపై మాంసం, కూరగాయల వ్యర్థాలు పారవేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో బుధవారం రాత్రి నిఘా పెట్టి, చెత్త వేస్తున్న ఒక వ్యాపారికి జరిమానా విధించారు. ఇకపై రోడ్లపై చెత్త వేస్తే రూ.10 వేల వరకు జరిమానా విధిస్తామని కార్యదర్శి స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్