భద్రాచలంలో ఛాంబర్ ఎన్నికల హడావిడి !

4చూసినవారు
భద్రాచలంలో ఛాంబర్ ఎన్నికల హడావిడి !
భద్రాచలం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 2015-16 ఎన్నికల్లో చారుగుండ్ల దేవి ప్రసాద్ అధ్యక్షులుగా, కంభంపాటి సురేష్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించారు. వారి మూడేళ్ల పదవీకాలం ముగిసి ఏడేళ్లు గడుస్తున్నా కొత్త కార్యవర్గం ఏర్పడలేదు. ఈరోజు పట్టణ వ్యాపారులు నూతన కమిటీ ఏర్పాటుపై చర్చించనున్నారు. ప్రధాన కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేసిన కంభంపాటి సురేష్ కుమార్ ను నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశాలున్నాయి. పోటీ అనివార్యమైతే, పారదర్శక ఎన్నికల నిర్వహణకు కమిటీని ఈరోజు నియమించనున్నారు.

సంబంధిత పోస్ట్