కార్తీక పౌర్ణమి పర్వదినాన, బుధవారం భద్రాచలం రామయ్య దేవస్థానం ఆధ్వర్యంలో వందలాది జంటలు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొన్నారు. స్వామివారి కథలను ఆలకించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రామయ్యను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని ఈవో దామోదర్ తెలిపారు.