భద్రాద్రి ఆలయంలో వైభవంగా సీతారాముల నిత్య కళ్యాణం

2243చూసినవారు
భద్రాద్రి ఆలయంలో వైభవంగా సీతారాముల నిత్య కళ్యాణం
భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో మంగళవారం నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకలో భక్తులు పాల్గొని తరించారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలు, విశేష ఆభరణాలతో అలంకరించారు. భక్తులు 'జై శ్రీరామ్' నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్