భగత్‌సింగ్ త్యాగం, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని
విద్యార్థులు పోరాడాలని మాజీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తిప్పని సిద్ధులు, డాక్టర్ భానుప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం భద్రాచలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి వేడుకలు నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు దండుగుల రాంచరణ్, మునిగెల శివ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.