బ్రిడ్జ్ పాయింట్ ఆటోస్టాండ్‌ను సందర్శించిన సబ్ కలెక్టర్

2చూసినవారు
బ్రిడ్జ్ పాయింట్ ఆటోస్టాండ్‌ను సందర్శించిన సబ్ కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్రిడ్జ్‌ పాయింట్‌ ఆటోస్టాండ్‌ను శనివారం సబ్‌ కలెక్టర్‌ మృణాల శ్రేష్ట సందర్శించారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడి, బీమా సదుపాయాలు, సురక్షిత డ్రైవింగ్, పిల్లల విద్య గురించి అడిగి తెలుసుకున్నారు. స్టాండ్‌ సమీపంలో తాగునీరు, మరుగుదొడ్ల లభ్యతతో పాటు ఇతర సమస్యలను కూడా ఆమె పరిగణనలోకి తీసుకున్నారు. అనంతరం వృద్ధులు, దివ్యాంగుల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, జెడ్‌పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్