భద్రాద్రిలో వైభవంగా సీతారాముల నిత్య కళ్యాణం

1చూసినవారు
భద్రాద్రిలో వైభవంగా సీతారాముల నిత్య కళ్యాణం
భద్రాద్రి క్షేత్రంలో బుధవారం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం, బేడా మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ ఘట్టాలను పూర్తి చేశారు. రామయ్య కళ్యాణాన్ని తిలకించి భక్తులు ఆనందోత్సాహాలతో తన్మయత్వం చెందారు. ఆలయ అధికారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్