భద్రాచలం రెండో వంతెనపై ఈ నెలలోనే రాకపోకలు: తుమ్మల

7చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం వద్ద గోదావరి రెండో వంతెన పనులను బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ నెలలోనే వంతెనపై రాకపోకలు ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వంతెన పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా వైపు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్