ఎటపాక మండలం గొల్లగొప్ప గ్రామంలో 33 మంది కడుపునొప్పి, వాంతులతో మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. వీరిని భద్రాచలం ఆస్పత్రికి తరలించగా, రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక పరిస్థితి విషమించి మార్గమధ్యంలో మృతిచెందింది. గ్రామంలో వైద్య సిబ్బంది లేకపోవడంపై సీపీఎం, ఎస్‌ఎఫ్‌ఐ, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.