గోదావరి రీడింగ్‌లలో తేడాలేంటి?

0చూసినవారు
గోదావరి వరద సమయంలో భద్రాచలం వద్ద నీటిమట్టం నమోదులో సీడబ్ల్యూసీ, ఇరిగేషన్‌ శాఖల రీడింగ్‌ల మధ్య తేడా కనిపిస్తోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు సీడబ్ల్యూసీ 43. 2 అడుగులుగా, ఇరిగేషన్‌ శాఖ 42. 8 అడుగులుగా నమోదు చేశాయి. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిపై కూడా వ్యత్యాసం ఏర్పడుతోంది. రెండు శాఖలు వేర్వేరు రీడింగ్‌లు నమోదు చేయడానికి కారణమేంటో, హెచ్చరికలకు ఏ రీడింగ్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారో స్పష్టత అవసరం.

సంబంధిత పోస్ట్