
చర్ల రోడ్డులో సినీ ఫక్కీలో కత్తులతో దాడి, ఒకరి మృతి
భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్ లో సినీ ఫక్కీలో కత్తులతో దాడి జరిగింది. వైన్స్ షాప్ సమీపంలో జరిగిన ఈ ఘర్షణలో సజ్జ రవి అనే వ్యక్తి మృతి చెందగా, ఇద్దరికి తలలకు గాయాలయ్యాయి. ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనను సముదాయిస్తున్న రవిపై మద్యం మత్తులో ఉన్న యువకులు ఖాళీ సీసాలు, కత్తితో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గాయపడ్డ మరో నలుగురికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి దాడిలో పాల్గొన్న యువకులను అదుపులోకి తీసుకున్నారు.














