Jan 01, 2026, 09:01 IST/
తొలి వందేభారత్ స్లీపర్ ఈ రూట్లోనే
Jan 01, 2026, 09:01 IST
సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భారత్లో త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని పేర్కొంది. ప్రధాని మోదీ తొలి వందేభారత్ స్లీపర్ రైలును కోల్కతా-గువాహతి మధ్య ప్రారంభించనున్నారని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ కొత్త రైళ్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చనున్నాయంటూ వెల్లడించారు.