ఖమ్మం: బీఆర్ఎస్ ధర్నాలో ఉద్రిక్తత.. సీఐ చేతికి గాయం!

1696చూసినవారు
కేసీఆర్ కు సిట్ నోటీసులను నిరసిస్తూ ఖమ్మంలో బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో వన్ టౌన్ సీఐ కరుణాకర్ చేతికి గాయమైంది. ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కక్ష రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వంపై బీఆర్ఎస్ మండిపడింది. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడిని పలువురు ఖండించారు.

సంబంధిత పోస్ట్