ఖమ్మం: ఎస్సీ హాస్టల్ అదృశ్యమైన విద్యార్థి మృతి

312చూసినవారు
ఖమ్మంలోని ఎన్ఎస్పీ కాలనీలోని ఎస్సీ హాస్టల్ నుంచి మూడు రోజుల క్రితం అదృశ్యమైన 8వ తరగతి విద్యార్థి సంజయ్ కుమార్ మృతదేహం శుక్రవారం ఎన్ఎస్పీ కాలువలో లభ్యమైంది. బుధవారం సాయంత్రం హాస్టల్ నుంచి వెళ్లిపోయిన సంజయ్ ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్