ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్వాధీనం చేసుకున్న రూ.3.43 కోట్ల విలువైన 687.409 కిలోల ఎండు గంజాయిని శనివారం శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో తల్లాడ మండలం గోపాల్పేటలోని ఏడబ్ల్యూఎం కన్సల్టెన్సీ లిమిటెడ్లో పోలీసులు ఈ గంజాయిని కాల్చివేశారు. గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.