అన్నవరంలో పాము కాటుతో మహిళ కూలీ మృతి

3630చూసినవారు
అన్నవరంలో పాము కాటుతో మహిళ కూలీ మృతి
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అన్నవరం గ్రామంలో మొక్కజొన్న చేనులో కూలీ పనులు చేస్తున్న బానోతు వాలి అనే మహిళా కూలీకి రక్తపింజర పాము మంగళవారం కాటు వేసింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో అన్నవరంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్