
ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి ఖాతా నుంచి రూ.27 వేల మాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచకు చెందిన ప్రశాంత్ మధ్యప్రదేశ్‌కు వెళ్లే క్రమంలో ఆదివారం కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద ఫోన్ పోగొట్టుకున్నాడు. ఆ ఫోన్‌కు అనుసంధానమైన ఫోన్‌పే ద్వారా కొత్త సిమ్ వాడి, ఖాతా నుంచి రూ. 27,940 నగదు విత్‌డ్రా అయినట్లు సందేశాలు వచ్చాయి. సైబర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయగా, కేసు పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయింది. ఎస్సై సురేశ్ దర్యాప్తు చేస్తున్నారు.





































