కొత్తగూడెం: గర్భం దాల్చిన ఆశ్రమ విద్యార్థిని

0చూసినవారు
కొత్తగూడెం: గర్భం దాల్చిన ఆశ్రమ విద్యార్థిని
అశ్వారావుపేట మండలం ఊట్లపల్లిలో 12 ఏళ్లలోపు గిరిజన బాలికపై 19 ఏళ్ల అరవింద్ లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దసరా సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన బాలికపై అరవింద్ పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆశ్రమానికి తిరిగి వెళ్ళాక బాలిక ఆరోగ్యం క్షీణించడంతో వైద్య పరీక్షల్లో నాలుగు నెలల గర్భవతి అని తేలింది. శిశుసంక్షేమ శాఖ అధికారుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై యయాతి రాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్