కొత్తగూడెం: గోదావరి నదిలో మునిగిపోతున్న వారి ప్రాణాలను కాపాడిన గజ ఈతగాడు కరుకు ప్రసాద్‌ను ఎస్పీ రోహిత్ రాజ్ ఘనంగా సత్కరించారు. ఇటీవల రవీంద్రభారతిలో ‘సాహస రత్న’, తిరుపతిలో ‘నేషనల్ అవార్డు’ అందుకున్న ప్రసాద్‌ను ఎస్పీ తన కార్యాలయంలో కుటుంబ సమేతంగా గౌరవించారు. ప్రాణాలను కాపాడటంలో ప్రసాద్ చూపుతున్న అసాధారణ ధైర్యసాహసాలను ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.