కొత్తగూడెం: వన్యప్రాణి వేట ఘటన.. కేసు నమోదు

5చూసినవారు
కొత్తగూడెం: వన్యప్రాణి వేట ఘటన.. కేసు నమోదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం పరిధిలోని మామిళ్లగూడెం అడవిలో మంగళవారం వన్యప్రాణి వేట ఘటన వెలుగు చూసింది. ఉచ్చులు పెట్టి అడవిపందిని వేటాడి చంపిన ఒక వ్యక్తిని అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అటవీ క్షేత్రాధికారి రవికిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని, వేటగాడిని పట్టుకున్నారు. మృతి చెందిన అడవి పంది మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అటవీ అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. వన్యప్రాణుల వేట చట్టరీత్యా నేరం అని, అడవి జంతువులకు హాని తలపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్