పాల్వంచలో 108 మంది రక్తదానం

1చూసినవారు
పాల్వంచలో 108 మంది రక్తదానం
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ఆర్. సతీష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమియా చిన్నారులు, ఇతర రోగుల అవసరాల కోసం పోలీసు అధికారులు, సిబ్బంది, పట్టణ యువత, ప్రజలు కలిపి 108 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణాలను కాపాడే గొప్ప సేవ అని డీఎస్పీ పేర్కొంటూ దాతలను అభినందించారు.

సంబంధిత పోస్ట్