భారీ వర్షాల నైపథ్యంలో 36వ డివిజన్‌ కార్పొరేటర్ విస్తృత పర్యటన

8చూసినవారు
భారీ వర్షాల నైపథ్యంలో 36వ డివిజన్‌ కార్పొరేటర్ విస్తృత పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ టౌన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల 36వ డివిజన్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ పైడిపల్లి జయలక్ష్మి మనోహర్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. గట్టాయిగూడెంలో యాసారాపు సరస్వతి అనే బాధితురాలి ఇంటికి వెళ్లి, వర్షపు నీటితో తడిసిన బియ్యం, సామాగ్రిని పరిశీలించి, ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్