కొత్తగూడెం ఆర్డీవో ప్రజావాణికి 5 దరఖాస్తులు
కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం ఐదు దరఖాస్తులు అందాయి. ఆళ్లపల్లి, అశ్వరావుపేట, చుంచుపల్లి, దమ్మపేట, ఇల్లందు మండలాల నుంచి ఒక్కో దరఖాస్తు వచ్చిందని ఆర్డీవో మధు తెలిపారు. ప్రజల వినతులను పరిశీలించి, పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.