రాజీవ్ గాంధీ మార్కెట్‌లో తెగిపడిన కరెంట్ వైర్

1120చూసినవారు
రాజీవ్ గాంధీ మార్కెట్‌లో తెగిపడిన కరెంట్ వైర్
న్యూ పాల్వంచలోని రాజీవ్ గాంధీ మార్కెట్‌లో ఆదివారం కరెంట్ వైర్ తెగిపడింది. చేపల మార్కెట్‌తో పాటు ఇతర మార్కెట్లు కూడా ఇదే ప్రాంగణంలో ఉండటంతో నిత్యం ప్రజలు రద్దీగా సంచరిస్తుంటారు. తెగిపడిన వైర్‌ను చూసి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి వైర్‌ను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్