పాల్వంచ పట్టణంలోని కేఎస్పీ రోడ్డులో బేతం శెట్టి వెంకట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ కమిటీ మండపంలో గురువారం 1500 మందికి ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా బేతం శెట్టి వెంకట్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు భక్తితో పాటు సేవా భావాన్ని చాటాలని, అందులో భాగంగానే భక్తులకు అన్నదానం నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బేతంచెట్టి విజయ్, భారతి, సుజిత, కొండలరావు, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మువ్వా అపర్ణ తదితరులు పాల్గొన్నారు.