కొత్తగూడెం: సింగరేణిలో కార్మికుల గైర్హాజరు బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏడాదిగా ఒక్కరోజు కూడా డ్యూటీకి హాజరు కానివారు 300 మంది, 50 మాస్టర్లు లోపు పనిచేసినవారు 1,000 మంది, 100 మాస్టర్లు పనిచేసినవారు 1,500 మందికి పైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సింగరేణి క్వార్టర్లు, ఇతర సదుపాయాలు పొందుతూ బయట పనులు చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది చోటా నాయకులు, మెడికల్ అన్ ఫిట్ ద్వారా వారసత్వ
ఉద్యోగాలు పొందిన యువకులు ఉన్నట్లు సమాచారం.