కొత్తగూడెం పట్టణంలో గురువారం ఏఐటియూసి అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ 15వ జిల్లా మహాసభ జరిగింది. ఈ సందర్భంగా వివిధ అడ్డాల నుండి 150 మంది ఆటో డ్రైవర్లు ఏఐటియూసిలో చేరారు. రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య మాట్లాడుతూ, ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటమే మార్గమని, వారి హక్కులు, సంక్షేమం, ఉపాధి భద్రత కోసం ఏఐటియూసి నిరంతరం పోరాడుతుందని తెలిపారు. పెరుగుతున్న ఇంధన ధరలు, జీవన వ్యయం, సంక్షేమ పథకాల అమలు, సామాజిక భద్రత, బీమా, పెన్షన్ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.