గాంధీనగర్‌లో బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతివేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణంలోని గాంధీనగర్‌లో భారతదేశ మాజీ ఉప ప్రధాని, సామాజిక సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళుల కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్వంచ మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కటుకూరి శేఖర్ బాబు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన 27 ఏళ్ల వయసులోనే పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ప్రజాసేవ ప్రారంభించారని, కేంద్ర ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా సేవలందించారని తెలిపారు.