భద్రాద్రి: 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

1248చూసినవారు
భద్రాద్రి: 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని దాసుతండా పంచాయతీ మంగళ తండా సమీపంలో శనివారం ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులు ఒక ఇంట్లో 200 క్వింటాళ్ల (400 బస్తాల) అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ బియ్యం ఎవరికి చెందినవో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్ఐ జి. వెంకటకృష్ణ, సివిల్ సప్లై ఆర్ఎ ఎన్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్