ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు వాతావరణ శాఖ దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తీవ్రమైన చలితో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండి, నెమ్మదిగా నడపాలని సూచనలు జారీ చేశారు.