భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, న్యూ పాల్వంచలోని పెద్దమ్మ గుడి వద్ద ఇందిరమ్మ ఇళ్ల డబుల్ బెడ్ రూమ్ డ్రా కార్యక్రమం వివాదాస్పద పరిస్థితుల మధ్య జరిగింది. డ్రా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ
బీజేపీ నేత ప్రభాకర్ తీవ్రంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, మేయర్‌తో పాటు పాల్వంచ కార్పొరేటర్లు పాల్గొన్నారు. డ్రా పద్ధతిపై అసంతృప్తితో
బీజేపీ నాయకులు తమ నిరసనను తెలియజేశారు.