
ఫిఫా ప్రపంచ కప్ 2026.. అమెరికా సంచలన విజయం
ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఆతిథ్య అమెరికా పరాగ్వేపై 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన 7వ నిమిషంలో డామియన్, ఆ తర్వాత ఫోలారిన్ రెండు గోల్స్ చేసి అమెరికాను 3-0 ఆధిక్యంలో నిలిపారు. రెండో హాఫ్‌లో పరాగ్వే మౌరిసియో ఒక గోల్ చేయగా, అదనపు సమయంలో గివోన్ని రీనా మరో గోల్ చేసి అమెరికాను 4-1 తేడాతో గెలిపించాడు. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో నాలుగు గోల్స్ చేయడం అమెరికాకు ఇదే ప్రథమం. అమెరికా జూన్ 20న ఆస్ట్రేలియాతో, పరాగ్వే టర్కీతో తలపడనుంది.




