కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు పర్యవేక్షణకు ఈ నెల 20న ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్
ఇండియా ప్రత్యేక బృందం రానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పనులు వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడిని కోరగా స్పందించారని వివరించారు. కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో అనువైన భూముల పరిశీలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. విమానాశ్రయం నిర్మాణంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు.