భద్రాచలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. యంగ్ బాయ్స్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన భారీ మట్టి వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యువకులు, భక్తులు భారీగా పాల్గొని ఉత్సాహంగా జల నిమజ్జనం నిర్వహించారు. డీజేలు, భక్తి గీతాల నడుమ యువత సందడి చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది. “గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ రావయ్యా” అంటూ భక్తులు నినాదాలు చేశారు.